08-10-2025 12:25:43 AM
మంచు లక్ష్మి పూర్తి పేరు లక్ష్మీప్రసన్న. నటుడు మోహన్‌బాబు తనయగా సుపరిచితురాలైన మంచు లక్ష్మి పుట్టినరోజు 1977, అక్టోబర్ 8వ తేది. నటిగా, నిర్మాతగా చిత్రపరిశ్రమలో సేవలందిస్తున్నారు. నాలుగేళ్ల వయసులోనే తన కెరీర్‌ను ప్రారంభించిన లక్ష్మి 20 వరకు భారతీయ సినిమాల్లో, యూఎస్‌లో కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో చిన్న పాత్రల్లో నటించారు.
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై ఇప్పటివరకు యాభైకిపైగా సినిమాలు రూపొందించారు. నటిగానూ పలు తెలుగు, తమిళ, మలయాళ, ఆంగ్ల భాషా చిత్రాల్లో నటించారు.