08-10-2025 12:26:46 AM
ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ‘సీవోఏఎస్ కమెండేషన్’ కార్డు (ఆర్మీలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే పురస్కారం)ను మోహన్‌లాల్ అందుకున్నారు.
ఓ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఈ అవార్డును అందుకోవటం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఉపేంద్ర ద్వివేది, ఆర్మీకి, టెరిటోరియల్ ఆర్మీకి ధన్యవాదాలు తెలిపారు. మోహన్‌లాల్ 2009 నుంచి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్నారు.