08-10-2025 12:24:37 AM
డైరెక్టర్ మారుతి పుట్టిన రోజు బుధవారమే. 1981, అక్టోబర్ 8న జన్మించిన ఈయన స్వస్థలం మచిలీపట్నం. ఇతని తండ్రి బండ్లపై అరటిపళ్లు అమ్మేవారు. తల్లి టైలరింగ్ చేసేది. మారుతి వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత యానిమేషన్ కోర్సు నేర్చుకునేందుకు 1998లో హైదరాబాద్ చేరుకున్నారు. చిత్రలేఖనంలో చేయి తిరిగిన మారుతి తన కళ్లతో చూసిన హైదరాబాద్ అందాలను తన సృజనాత్మక బొమ్మల కళలో ఆవిష్కరించేవారు. యానిమేషన్ ట్రైనర్‌గా జీవనం సాగిస్తున్న టైమ్‌లో నిర్మాత బన్నీవాసుతో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయమే ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసే అవకాశం కల్పించింది. తర్వాత ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’, ‘ప్రేమిస్తే’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తర్వాత దర్శకుడిగా మారారు. ఈ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ప్రేమకథా చిత్రమ్, లవ్‌యూ బంగారం, భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, రోజులు మారాయి, మహానుభావుడు, శైలజరెడ్డి అల్లుడు, ప్రతిరోజూ పండగే, మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజాసాబ్’ విడుదల కావాల్సి ఉంది.