25-07-2024 01:57:12 AM
తిరస్కరించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): జాబ్ క్యాలెండర్ ప్రకటన తో పాటు నిరుద్యోగుల ఇతర న్యా యపరమైన డిమాండ్లపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వాయిదా తీర్మా నం ఇచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపాదించిన ఈ వాయిదా తీర్మానాన్ని శాసన సభాపతి తిరస్కరించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ప్లకా ర్డులు పట్టుకుని నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తు న సభలో నినాదాలు చేశారు.