calender_icon.png 15 November, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పెద్దమ్మతల్లి బోనాలు

15-11-2025 07:58:01 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని రంగనాయకులగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయంలో పెద్దమ్మతల్లికి ముదిరాజ్ కులస్తులు శనివారం బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా గత నాలుగు రోజులుగా యజ్ఞాలు, హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి, శనవారం అమ్మవారికి ప్రతి ఇంటి నుండి బోనంతో తల్లి వద్దకు కదిలారు. మహిళలు, యువతులు, శివసత్తులు డప్పు చప్పుళ్లు మధ్య ఊరేగింపుగా చేరుకొని తల్లికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధికసంఖ్యలో రావడంతో ఆలయప్రాంగణం కోలాహలంగా మారింది.