15-11-2025 09:00:17 PM
నకిరేకల్‌లో రాజేష్–సుజాత రిజిస్టర్ మ్యారేజ్
నకిరేకల్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలోని నకిరేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శనివారం ఒక అందమైన ప్రేమకథకు సాక్ష్యమైంది. కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బాచుపల్లి రాజేష్, నేపాల్‌కు చెందిన సుజాత తప పరస్పర ప్రేమ, విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం దుబాయిలో పనిచేస్తున్న సమయంలో పరిచయమైన రాజేష్–సుజాతల పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
సరిహద్దులు, భాషలు, సంప్రదాయాలు ఏవీ ప్రేమను అడ్డుకోలేవన్న నిజాన్ని ఈ జంట మరోసారి నిరూపించింది.కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరిని ఆశీర్వదించగా… ఇలాంటి ప్రేమ వివాహాలు రెండు దేశాల మధ్య స్నేహాన్ని, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. కొత్త జీవితాన్ని ప్రేమతో, పరస్పర గౌరవంతో ప్రారంభించిన రాజేష్ సుజాతల దంపతులకు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.