15-11-2025 08:48:31 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి, వ్యవసాయ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర్ రావు జన్మదిన వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్గ రాజకీయ నాయకుడిగా పలు శాఖలకు మంత్రిగా కొనసాగుతూ నిరంతరం ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకులు తుమ్మల నాగేశ్వర్ రావు అని కొనియాడారు.
వారు మున్ముందు కూడా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎండి తాజ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,లాయక్,దండి రవీందర్,అబ్దుల్ రహమాన్,షబానా మహమ్మద్,అస్థాపురం రమేష్,నాగుల సతీష్,మిరాజ్,మాసుం ఖాన్,ఆంజనేయులు,భారీ,బషీర్,ఖలీల్,నదీమ్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.