15-11-2025 08:52:25 PM
మండల కాంగ్రెస్ నాయకులు గాండ్ల సురేష్..
మణుగూరు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని మండల కాంగ్రెస్ నాయకులు గాండ్ల సురేష్ అన్నారు. శనివారం సమితి సింగారం గ్రామపంచాయతీలోని అశోక్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, లబ్ధి దారులు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి విడతలవారీగా వచ్చే లబ్ధి పొందాలన్నారు. డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలకు రూ. లక్ష వరకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఒక్క పేదవాడు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనిచేస్తున్నారని, స్పష్టం చేశారు. మీ కోసం, మీ సంక్షేమం కోసమే ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పారదర్శకంగా ఎవ్వరి మధ్యవర్తిత్వం లేకుండా అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా త్రిమూర్తులు, ఎండి యాకూబ్ అలీ, పద్మాల సత్యనారాయణ, దాసరి కృష్ణ, కొలపిన్ని మానస, గద్దల ఆదిలక్ష్మి, దాసరి పార్వతి పాల్గొన్నారు.