calender_icon.png 15 November, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవరప్ప మరణంపై పునః విచారణ పూర్తిగా జరపాలి

15-11-2025 08:51:13 PM

_ చట్ట పరమైన చర్యలు తీసుకుని కుటుంబానికి న్యాయం చేయాలి

_ ఎస్పి నీ కలిసిన ముదిరాజ్ సంఘం  నాయకులు

నారాయణపేట టౌన్: నారాయణపేట పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ మారుతి తండ్రి భక్తుల సవరప్ప మృతిపై సమగ్ర పునః విచారణ జరిపి ఆకుటుంబానికి న్యాయం చేయాలని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సరాఫ్ నాగరాజ్, పట్టణ అధ్యకుడు మిర్చి వెంకటయ్య, మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మెన్ కోణంగేరి హనుమంతు, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్, గోపాల్. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పి డాక్టర్ వినీత్ ను కలిసి విన్నవించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చాలా రోజులు నుండి మేము గమనిస్తూనే ఉన్నామనీ. ఈ విషయం లో పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తా రని ఓపిక తొ ఉన్నామని అన్నారు.భక్తుల సవరప్ప ను కిడ్నాప్ చేసి ఉద్దేశపూర్వకంగా శాస్త్ర చికిత్స పేరుతో ప్రమాదం జరిపి వారి మరణానికి కారకులైనారు. ఇప్పటి వరకు సవరప్ప మరణం పై ఉన్న సందేహాల విషయంలో మహిళ కమిషన్ ఆదేశాల మేరకు చెపట్టిన  పునః విచారణలో తేలిన విషయాలు చూసి ఖంగు తిన్నామనీ తెలిపారు. నాటి దొరల పాలనలో పోలీసులు , పోలిస్ వ్యవస్థ ఏ విధంగా నడుచుకు న్నారొ అర్థం అవుతుందన్నారు.

నాటి పోలీస్ అధికారి బి.మారుతి, వారి కుటుంబ సభ్యుల పిర్యాదు లపై విచారణ చేయలేదు. చర్యలు చేపట్టలేదనీ, విచారణ చేయకుండా కుండా తమ విధులు నిర్లక్ష్యం వహించి మొదటి తప్పు చేశారన్నారు. విచారణ చేయకుండా జరిగిన నిజాన్ని దాచి తప్పుడు సమాచారంతో అసంపూర్తి సమాచారం తో చార్జీ షీట్ వేసి పోలీసులు రెండవ తప్పు చేశారన్నారు. తమ తప్పులు బయటకు రాకుండా కప్పి పుచ్చుకొవడానికి  జరిగిన సంఘటన దాచి తప్పుడు సమాచారంతో కిడ్నాప్ చేసినట్టు కాని, ఉద్దేశపూర్వ కంగా ప్రమాదం గురి చేసి నట్టు కాని, శాస్త్ర చికిత్స  కారణం చేత .భక్తుల సవరప్ప  శవాన్ని నారాయణపేట కు  తెవడం.

బౌన్సర్ల అండతొ , పోలీస్ సహకారంతో హడవి డిగా తక్కువ సమయంలో అంత్యక్రియలు జరపడం, శవానికి పోస్ట్ మార్టం జరిగితే దాచి పెట్టి ఉంచడం , క్యాన్సర్ లేకుంటే క్యాన్సర్ ఉందని ప్రచారం చేయడం, గుండెపోటుతో చనిపోయారు అని అబద్దం ప్రచారం చేయడంవిడ్డూరంగా ఉందని అన్నారు. ఆసుపత్రి లో అన్ ఫిట్ వయో వృద్ధునికి అవసరం లేకున్నా బలవంతంగా చికిత్స చేయడం, భారతీయ వైద్య చట్టం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి వైద్యులు శాస్త్ర చికిత్స చేయడం జరిగితే దాచడం, కిడ్నాప్ లో పాల్గొన్నవారి పేర్లు, కిడ్నాప్ కు సహకరించిన వారి పేర్లు నమోదు చేయకుండా అసంపూర్తి, తప్పుడు సమాచారంతో  చార్జ్ షీటు వేశారనీ తెలిపారు.

ఆ రోజు ఎవ్వరు ఒత్తిడి వల్ల నొ , ఏ ప్రలొబాలకు   లోంగి  తమ  విధుల పై నాటి పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆ రోజు పోలీస్ అధికారులు చట్టం ప్రకారం నియమ నిబంధనల ప్రకారం విదులు నిర్వహించి ఉంటే భక్తుల సవరప్ప కిడ్నాప్ నుండి, ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి నుండి  ప్రాణాలతో బయటపడి ఉండే వారనీ అన్నారు. కానీసం తెచ్చిన శవానికి పంచనామా, విచారణ చేయకపోవడం, పొలిసులు చెపట్టిన రి ఇన్వెస్టిగేషన్ లొ బయట పడిందనీ అన్నారు. పోలీస్  అధికారులు నాడు చేసిన తప్పులను మళ్ళీ జరిగితే ఉపేక్షించేది లేదనీ స్పష్టం చేశారు.

ముదిరాజ్ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఏ ప్రభుత్వ శాఖలో అయిన ఏ  ప్రభుత్వ కార్యాలయం లొ అయిన ఏ అధికారులు నైనా మన హక్కులను అడ్డుపడితే చట్ట ప్రకారం మన హక్కులను  మనం వినియోగించు కుందామనీ అన్నారు. ముదిరాజ్ సోదరులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరికైన  ఏ సమస్య ఉన్న మా దృష్టికి  తీసుకొనిరావాలని సూచించారు. ముదిరాజ్ పెద్దల మందరం  కలిసి పరిష్కారం కోసం కృషి చేస్తాన్నారు.

గతంలో మాదిరి దొరల ప్రభుత్వం లో జరిగినట్టు కాకుండా మన నారాయణపేట జిల్లా వాసి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. కీ.శే. భక్తుల సవరప్ప మరణంపై పున విచారణ క్షుణంగా పూర్తి చేసి చట్టపరంగా  చర్యలు తీసుకోవాలని లేకపోతే డిజిపి వరకు సమస్యను తీసుకెళతామని స్పష్టం చేశారు.ఎస్పి స్పనందిస్తూ తప్పక విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.