calender_icon.png 15 November, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొని పలువురికి గాయాలు

15-11-2025 08:56:12 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో జనగాం సూర్యాపేట జాతీయ రహదారి మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు సూర్యాపేట నుండి జనగాంకు వెళ్తున్న ఒక లారీని ఆపుతున్నప్పుడు, జనగాం నుండి సూర్యాపేటకు వెళ్తున్న ఒక గుర్తుతెలియని కారు నాగారం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పిసి కమలాకర్(34)ను, రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరు సాధారణ పౌరులను ఢీకొట్టగా కమలాకర్ అనే కానిస్టేబుల్ కు రెండు కాళ్లు విరిగినవి అలాగే తలకు గాయాలు అయింది. ఇద్దరు సాధారణ పౌరులకు గాయాలు అయింది. వారిని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కమలాకర్ పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నది. జరిగిన సంఘటనపై నాగారం పోలీసులు విచారణ చేపడుతున్నారు.