15-11-2025 09:05:27 PM
జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జాగృతి సమరశీల పోరాటాలకు కృషి చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. శనివారం జిల్లా అద్యక్షుడు రంగినేని శ్రీనివాస రావు అధ్యక్షతన జాగృతి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రూప్ సింగ్ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత సంకల్పం సామజిక తెలంగాణ, సమస్యలు లేని సమాజం వీటి సాధనకు ప్రతి జాగృతి కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మొన్న జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి దండెం ఆనంద్, జిల్లా జాగృతి నాయకులు అసపు ప్రమోద్, శ్రీపాద కార్తీక్, శ్రీనివాస్, మౌనిక రాథోడ్, గేడం విష్ణు, డేవిడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.