calender_icon.png 15 November, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిఎస్ యుటిఎఫ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

15-11-2025 09:10:21 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల టీఎస్ యుటిఎఫ్ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నట్లు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. మండల నూతన అధ్యక్షులుగా బి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా జి.వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా బి.నవీన్ కుమార్, కె.రేణుక, కోశాధికారిగా ఏ.లక్ష్మినారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

నూతన కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ... మండలంలోని ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి,సంఘం బలోపేతానికి విద్యార్థుల సర్వతో ముఖ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.సంఘం జిల్లా కార్యదర్శి బాల సైదిరెడ్డి,జిల్లా ఆడిట్ కన్వీనర్ సాంబయ్య,జిల్లా కన్వీనర్ శీనయ్య,మండల కన్వీనర్ ఆర్ రవీందర్ ఆధ్వర్యంలో టీఎస్ యుటిఎఫ్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.