calender_icon.png 13 May, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం

23-04-2025 12:00:00 AM

గ్రీన్ ఇండియాతో కలిసి మెడికవర్ హాస్పిటల్స్ నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ పర్యావరణ సంరక్షణ పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. ‘డీఫారెస్టేషన్ నుంచి రీఫారెస్టేషన్ వరకు - సాంప్రదాయ పద్ధతుల నుంచి డిజిటల్ మార్గాల్లోకి’ అనే ధ్యేయంతో ఓ సమగ్ర గ్రీన్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించింది. సోమవారం మెడికవర్ హా స్పిటల్స్ డాక్టర్లు ఆస్పత్రి ఆవరణలో మొక్క లు నాటి, వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.

డాక్టర్ విక్రమ్ కిషోర్‌రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్‌రె డ్డి, డాక్టర్ శశిధర్ ఇందులో పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి పేపర్‌లెస్ హెల్త్‌కేర్ వ్యవస్థను అందిస్తున్న ఆసు పత్రుల్లో మెడికవర్ హాస్పిటల్స్ ముందంజలో ఉంది. ఈ సందర్భంగా మెడికవర్ హా స్పిటల్స్ ఇండియా క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్‌రెడ్డి మాట్లాడుతూ.. భూమిని కాపాడే ప్ర యత్నం చిన్న చిన్న నిబద్ధతతో కూడిన చర్యలతో మొదలవుతుందన్నారు.

మొక్కలు నా టడం, టెక్నాలజీ వినియోగించడం ద్వారా ఆ రోగ్యవంతమైన భూమిని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. గ్రీన్ ఇండియా ఫౌండర్ సంతోష్ మాట్లాడుతూ.. డిఫారెస్టేషన్ సమస్యల నుంచి రీఫారెస్టేషన్ చర్యలకు, పర్యావ రణ పరిరక్షణకు టెక్నాలజీని కలుపుకున్న మె డికవర్ హాస్పిటల్స్ మాదిరి మోడల్‌కు ప్రా చుర్యం అవసరమన్నారు. కార్యక్రమంలో గ్రీ న్ ఇండియా రాష్ట్ర ఇన్‌చార్జి సతీష్, సిద్దిపేట ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.