calender_icon.png 14 August, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్ ఘర్ తిరంగా వేడుకలు

14-08-2025 04:58:45 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు... హర్ ఘర్ తిరంగా యాత్ర, అమరవీరుల విగ్రహాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా నేడు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు(BJP Mandal President Vennamaneni Sridhar Rao) అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా ర్యాలీ, విగ్రహ శుద్ధి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన త్రివర్ణ పతాక వైభవాన్ని చాటడంలో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు మన సైనికుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల గర్వంతో ఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా, మన దేశ సైనికుల పరాక్రమంపై గర్వంతో జాతి సమైక్యతకు ప్రతీకగా ప్రతీ ఒక్కరం మన ఇళ్ళపై జాతీయ పతాకాన్ని ఎగురవేద్దాం దేశభక్తిని చాటుకుందాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగ మండల కన్వీనర్ ఆడెపు రవీందర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోలా ఆంజనేయులు, జిల్లా మెంబర్స్ బక్క శెట్టి రాజేందర్, ఇటుకల మహేందర్,ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు, ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్ సిలివేరి ప్రశాంత్ పోకల శ్రీనివాస్,  కట్ల తిరుపతి పత్యం ముత్యం మైలారం మహేష్, కట్ట తిరుపతి పోలవేణి అనిల్ గొర్రె మహేష్ కృష్ణ చారి జలపతి కృష్ణ కర్నే గణేష్ నందగిరి నవీన్ సుద్దాల మహేష్ గౌడ్ కేంద్ర ఇంచార్జి లు బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.