calender_icon.png 14 August, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల పంపిణీ

14-08-2025 05:17:04 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): తంగళ్ళపల్లి మండలం(Thangallapalli mandal) అంకుసాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్ చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. నెలల నరసింగం గౌడ్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. దీని ద్వారా అందరికీ నాణ్యమైన సన్నబియ్యం కూడా అందించడం జరుగుతుంది, ప్రభుత్వ మాట ఇచ్చిన ప్రకారం ప్రతి సంక్షేమాన్ని అమలు చేసి తీరుతుందని తెలియజేస్తూ ప్రభుత్వ పెద్దలందరికీ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యrక్షులు అంజయ్య, ప్రధాన కార్యదర్శి కంకణాల లక్ష్మణ్, బైరి వెంకటరెడ్డి,భైరి శ్రీనివాస్, రెడ్డి,   భానుచందర్, అంచ సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.