calender_icon.png 14 August, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ కాలనీలో మెడికల్ క్యాంప్

14-08-2025 05:26:53 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తంగళ్ళపల్లి మండలంలో ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ యందు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కాలానుగుణ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది, పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగింది. 154 మందికి ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేసి 25 మందికి రక్త నమూన పరీక్షలు చేసినాము. అందరికీ మందులు పంపిణీ చేయడం జరిగింది. 3 బృందాలుగా ఏర్పడి ఇంటింటి డ్రై డే నిర్వహించడం జరిగింది. ఆంటీ లార్వల్ స్ప్రే చేయడం జరిగింది. నీటి నిలువలను గుర్తించి ఆయిల్ బాల్స్ ను వేయడం జరిగింది. కూలర్లు, డబ్బాలను పరిశీలించి నీటిని పడవేయడం జరిగింది. వైద్య శిబిరంలో డాక్టర్ దీప్తి,హెల్త్ సూపర్వైజర్ కే ప్రమీల ఏ ఎన్ఎం  ప్రమీల, జ్యోతి, సతీష్ కుమార్ ఆశాలు  పంచాయతీ సిబ్బంది అనూష, శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.