14-08-2025 06:05:18 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు ఘనవిజయం సాధించడం పట్ల పట్టణంలోని తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మాట్లాడుతూ, ఏపీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. 30 సంవత్సరాల నుండి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి అరాచకానికి నేడు కూటమి ప్రభుత్వం సంకెళ్ళు తీసిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(AP Chief Minister Chandrababu Naidu) నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రమేష్ బాబు, తెదేపా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలముల బాలకృష్ణ, దేశావత్ శ్రీహరి, సీనియర్ నాయకులు కారు నరసన్న, మైప బాలరాజు, అయ్యోరి నాగరాజు, కంది రవి, దగ్గుల లింగయ్య, దాసరి గోపాలకృష్ణ, నవీన్, రాజేష్, శ్రీవేద్, వినీత్, చిన్న తదితరులు పాల్గొన్నారు.