14-08-2025 05:29:39 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ముత్యాలమ్మ వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆరు ఆరోగ్యలతో సుఖ సంతోషాలతో ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham), మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని వేరువేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నకిరేకల్ సిఐ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ పన్నాల రాఘవ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్ ,నకిరేకల్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు కొండ వెంకన్న గౌడ్, మాజీ అధ్యక్షుడు కొండ జానయ్య గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.