14-08-2025 05:32:51 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అవసరమని మండల విద్యాధికారి మేక నాగయ్య(Mandal Education Officer Meka Nagaiah) పేర్కొన్నారు. మండలంలోని తాటికల్ గ్రామానికి చెందిన సీనియర్ వైద్యులు మంచుకొండ రంగయ్య గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడిటోరియం నిర్మించేందుకు ముందుకువచ్చారు. గురువారం ఆయన పాఠశాలలో ఆడిటోరియం నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను చదువుకున్న పాఠశాలకు ఆడిటోరియం నిర్మించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మంచుకొండ సుధాకర్, మంచుకొండ నిరంజన్, అంజమ్మ, సుదర్శన్, జ్యోతి, రేవతి, రమేష్, మంచుకొండ సోమయ్య, నూకల జానయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.