14-08-2025 05:35:11 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మండలంలోని తాటికల్ గ్రామంలో కంఠమహేశ్వర స్వామి, సురమాంబ దేవి కళ్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham), మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేరువేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ కంఠమహేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీకి రూ. 10 వేలు విరాళం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చనగాని మంజుల సుధాకర్, మాజీ ఎంపీటీసీ మిర్యాల చంద్రశేఖర్, గాధగోని శ్రీలత కొండయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు పుట్ట లింగయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలగోని వెంకటేష్, నాయకులు బంటు రవి, రాచకొండ శ్రవణ్, జ్యోతిబాసు, అంజి, చనగాని నాగరాజు గౌడ్, నర్సింగ్ మహేష్ గౌడ్, మాధగోని రవీందర్, నూకల జానయ్య, చనగాని జానయ్య, సిరికొండ శివాజీ, పోలగానిశ్రీనివాస్, మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.