14-08-2025 04:56:12 PM
హన్మకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బాషా సాంస్కృతిక విభాగం వారి ఆర్థిక సాయంతో వరంగల్ లో కాకతీయ మ్యూజికల్ అకాడమీ, బజ్జురి ఆర్గనైజేషన్, కృష్ణ సొసైటీ సంయుక్తంగా ఆగస్టు 15వ తారీకు, 16న శ్రీకృష్ణ జన్మాష్టమి సాహిత్య సంగీత నృత్యోత్సహాలను రాధాకృష్ణ గార్డెన్స్ వరంగల్ చౌరస్తా యందు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రిటైర్డ్ ప్రొఫెసర్ వీ. తిరుపతయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణునిపై భక్తి పాటలు, కీర్తనలు, నృత్యాలు ప్రదర్శింపబడుతాయని, అందరూ కళాకారులు, కళాభిమానులు, ఆహ్వానితులేని అన్నారు. ఆగస్టు 15 మధ్యాహ్నము రెండు గంటలకు పూజ, ప్రార్థన నృత్య కార్యక్రమాలతో ప్రారంభిస్తామని అన్నారు.
16 తారీకు శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి శ్రీకృష్ణుని పాటలతో కీర్తనలతో, భగవద్గీత శ్లోకాలతో ఈ కార్యక్రమం ప్రారంభించి ఉట్టి కొట్టే కార్యక్రమం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర కొండ సురేఖ, కలెక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, పోలీస్ కమిషనర్,నగర మేయర్ గుండు సుధారాణి, కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు అనిత రెడ్డి పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో ఇందారం నాగేశ్వరరావు, బిటావరం శ్రీమన్నారాయణ, నల్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.