calender_icon.png 14 August, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

14-08-2025 05:23:41 PM

మునిపల్లి (విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల, కళాశాల(Lingampalli Gurukul School and College)లో గురువారం నాడు మాదకద్రవ్యాలు నియంత్రణపై మునిపల్లి ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత పెడదారి పట్టకుండా ఎలా ఉండాలి మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి మనం ఇప్పుడు ఎలా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటాం అనే దృగ్విషయని విద్యార్థులకు ఎస్సై జగదీష్ వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురభి చైతన్య, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రజిత, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.