calender_icon.png 14 August, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలనీ భూములు కబ్జా కాకుండా చూడాలి

14-08-2025 05:10:36 PM

పంచాయతీ కార్యదర్శికి వినతి

గాంధారి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని దుర్గానగర్ కాలనీలో కాలనీకి సంబంధించిన భూములను కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తూ కాలనీవాసులు గురువారం పంచాయతీ కార్యదర్శి నాగరాజు(Panchayat Secretary Nagaraju)కు వినతిపత్రం అందజేశారు. తక్షణమే స్పందించిన పంచాయతీ కార్యదర్శి కాలనీవాసులను వెంటబెట్టుకుని వెళ్లి కబ్జాకు గురైనకాలనీ భూములను సర్వే(కొలతలు) నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. దుర్గానగర్ కాలనీ చెందిన కాలనీ భూములలో వివాస్పదమైన భూములలో ఇంటి నిర్మాణానికి పరిమిషన్ ఇవ్వవద్దని, ఆ భూములు కాలనీ ప్రజల ఉమ్మడి ఆస్తి అని కాలనీ వాసులు తెలిపారు. కాలనీ వాసులకు తెలియకుండా వివాదాస్పదమైన భూములను ఎవరు కొనవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.