calender_icon.png 14 August, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖేడ్ లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

14-08-2025 05:20:13 PM

నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు సిందోల్ దశరథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు పత్రీ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ, యువతలో జాతీయత, దేశభక్తి పెంపొందించాలని, దేశ ఐక్యతలో భాగంగా దేశాన్ని గౌరవించాలని, పేద, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు.

ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి, భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా జరుపుకోవడానికి ఈ ర్యాలీ దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ అశోక్ గౌడ్, యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ పట్నం మాణిక్, మేకల జ్ఞానేశ్వర్, వెంకటేష్, వెంకట్ రెడ్డి, లోకేష్, భూంరాజ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.