21-11-2025 12:21:54 AM
మఠంపల్లి, నవంబర్ 20: మండలంలోని అల్లిపురం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు గురువారం రాధికా రైస్ ఇండస్ట్రీ యాజమాని కొమ్మనబోయిన లక్ష్మినారాయణ విద్యార్థులకు స్టడీ చైర్స్,ఉపాధ్యాయులకు కూర్చిలు బహుకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకోవడంలో ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతోనే కుర్చీలు బహుకరించినట్లు తెలిపారు. తదుపరి ప్రధానోపాధ్యాయులు శేషి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థులకు స్టడీ చైర్లు12, ఉపాధ్యాయుల కొరకు చైర్లు10 దాతలు అందించడం అభినందనీయం అన్నారు. దాత లక్ష్మీ నారాయణ కు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.