21-11-2025 12:21:48 AM
వెంకటాపురం(నూగూరు), నవంబర్ 20(విజయక్రాంతి):ములుగు జిల్లా వెంకటాపురం మండలం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాన్ బోస్కో సంస్థ యొక్క సహకారంతో వెంకటాపురం, వాజేడు మండలాల్లోని వరద ముంపుకు గురైన 400 బాధిత కుటుంబాలకు కాఫెడ్ సంస్థ నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చాప, కండవా తదితర వస్తువులు వారి యొక్క ఆఫీసు ఆవరణంలో పంచిపెట్టారు. ఈ యొక్క సేవా కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు కాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క మారుమూల గ్రామాల్లో చాలా జరుగుతున్నాయని అభినందించారు. అదేవిధంగా ఈ యొక్క కాఫెడ్ సంస్థ వారు ఈ యొక్క గిరిజనుల యొక్క పిల్లల చదువుల కోసము, వారి యొక్క చదువు మధ్యలో ఆగిపోకుండా ముందుకు కొనసాగించటానికి కూడా పాటుపడి వారి యొక్క అభివృద్ధికి ఇంకా మెరుగుగా కృషి చేయాలని కోరారు.
వెంకటాపురం సిఐ ముత్యం రమేష్, ఎస్త్స్ర తిరుపతి రావు మాట్లాడుతూ ఈ యొక్క సంస్థ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలలో చాలా అభివృద్ధి జరుగుతుందని, మారుమూల ప్రాంతాలలో వారి యొక్క సేవ అభినందనీయమని కొనియాడారు. కాఫెడ్ సంస్థ డైరెక్టర్ లూర్దు రాజు మాట్లాడుతూ గిరిజనలు వారి యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క పిల్లలను బాగా చదివించి ఒక అడుగు ముందుకు వేయాలని, వారి యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు మరిచిపోకుండా వాటిని క్రమబద్ధంగా జరుపుకుంటూ వారి ఉనికిని చాటుకోవాలని తెలియచెప్పారు.
ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కాఫెడ్ సంస్థ, డాన్ బోస్కో సంస్థ వారిని, వారి యొక్క సేవ అభినందనీయమని కొనియాడారు. బియ్యం 10 కేజీలు, కందిపప్పు కేజీ, మైసూర్ పప్పు కేజీ, సెనగలు కేజీ, గోధుమపిండి రెండు కేజీలు, కేజీ టీ పౌడర్, ఒక ప్యాకెట్ పసుపు, ఒక ప్యాకెట్ కారం, ఒక ప్యాకెట్ మసాలాలు, మూడు వెరైటీలు చింతపండు,
ఒంటి సబ్బులు నాలుగు, రిన్ సబ్బులు నాలుగు, బ్లీచింగ్ పౌడర్, ఒక చాప, ఒక బెడ్ షీట్, రగ్గులు, దుప్పట్లు, కండువలు, బరకం, ఒక ఆయిల్ ప్యాకెట్ మొదలగు వస్తువులు 400 మంది వరద బాధిత కుటుంబాలకు డాన్ బోస్కో సంస్థ, కాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో సహాయం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కాఫెడ్ సంస్థ డైరెక్టర్ కోఆర్డినేటర్లు, యానిమేటర్లు, వారి సహాయ సహకారాలు, సేవా భావం అభినందనీయమని ప్రజలంతా కొనియాడారు.