calender_icon.png 8 January, 2026 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్నకు రాష్ట్రస్థాయి అరుదైన గౌరవం

07-01-2026 07:31:26 PM

స్వప్నను సన్మానించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ ఎం. స్వప్నకు అరుదైన గౌరవం లభించింది.2013 నుండి స్పెషల్ ఆఫీసర్ గా విధుల్లో చేరినప్పటి నుండి అంకిత భావంతో అందించిన సేవలను గుర్తించి పాఠశాల విద్యాశాఖ, స్టేట్  ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలాస్  హైదరాబాదులో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖ డైరెక్టర్,  జాయింట్ డైరెక్టర్  వెంకట నర్సమ్మ  స్పెషల్ ఆఫీసర్ స్వప్నని ప్రత్యేకంగా ప్రశంసించారు.

నిబద్ధత, స్థిరత్వం, బాలికల విద్య, సంక్షేమం పట్ల నూతన బాధ్యతతో నాయకత్వం వహించి విద్యాలయాన్ని ముందుకు నడిపించారని అన్నారు. అలాగే పాఠశాల విద్యా క్రీడలు స్థిరత్వం అద్భుతంగా విద్యాలయం అభివృద్ధి చెందిందని, జిల్లాలో అత్యంత శక్తివంతమైన అధిక పని తీరు కనబరిచిన కేజీబీవీ లలో ఒకటిగా నిలిచిందని అన్నారు. 2013, 14 విద్యా సంవత్సరంలో కేవలం 56 మంది స్టూడెంట్స్ సంఖ్య నుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం 100 శాతం విద్యార్థుల నమోదు చేస్తున్నారని ప్రశంసించారు. విద్యతో పాటు బాలికల తల్లిదండ్రుల కు బలమైన విశ్వాసాన్ని కలిగించే విధంగా ఇంటింటికి ప్రచారాలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి మంచి ఫలితాలు సాధించిందన్నారు.

2024-25 విద్యా సంవత్సరంలో వంద ఎస్ఎస్సి పరీక్షల్లో ఫలితం, అలాగే ఇంటర్మీడియట్లో రాష్ట్ర మరియు జిల్లాస్థాయిలో విద్యార్థులు టాపర్ల్లుగా నిలిచేందుకు కృషి చేశారు. ఇన్స్పైర్ , సైన్స్ ఫెయిర్, టాలెంట్ టెస్టులు, బహుళ సాహపాట్యవేదికలలో కూడా విద్యార్థులు రాణించారని తెలిపారు. అలాగే స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఫుడ్ ప్రాసెసింగ్, క్రాఫ్ట్ బెకర్ లాంటి వృత్తి విద్యలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇవన్నీ విజయాలు విద్యార్థుల ఇంటర్నెషిప్, పారిశ్రామిక సందర్శన, ఉపాధి నైపుణ్యత, ఉపాధి అవకాశాలకు బాటలు వేశాయని తెలిపారు.

అలాగే ఈ విద్యాలయంలో విద్యార్థులచే కేజీబీవీ బ్యాంక్ నిర్వహణ, జాతీయస్థాయిలో ఫ్లోర్ బాల్, కరాటే వంటి క్రీడల్లోనూ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కలరిపయట్టు, హార్ట్ ఫుల్ నెస్ యోగ, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలోనూ పట్టుదలతో కృషి చేశారని డైరెక్టర్ కొనియాడారు. ఎన్జీవో సహకారంతో కొత్త టాయిలెట్లు, సౌర విద్యుత్ సంస్థాపన, అప్ గ్రేడ్ చేసిన ల్యాబ్ లు, పోషకాహార అభ్యాస వాతావరణం, న్యూట్రి గార్డెన్స్ వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించారని తెలిపారు.నిబద్ధత, పట్టుదల, విద్యార్థుల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేసినందుకుగాను స్వప్న కు  ఈ సత్కారం చేసినట్టు విద్యాశాఖ డైరెక్టర్ ఇ. నవీన్ నికోలస్ పేర్కొన్నారు.