29-08-2025 01:51:32 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, ఆగస్టు 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు మహ బూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. మహబూబాబాద్‌లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అవసరమైన భూమిని గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదిక అందించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతారం, శనిగపురం, మల్యాల గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను అధికారులతో కలిసి గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు.