calender_icon.png 29 August, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ములుగుకి మూడవ స్థానం

29-08-2025 01:55:21 AM

కలెక్టర్‌ దివాకర టి.ఎస్.

ములుగు, ఆగస్టు28(విజయక్రాంతి) : నిరుపేదలకు సొంత ఇళ్లను అందించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వేగవంతంగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తెలిపారు. మొదటి విడత మరియు రెండవ విడతలో42 శాతం గ్రౌండింగ్ పూర్తి అయినందున ఈ ఆగష్టు మాసములో రాష్ట్ర స్థాయిలో ములుగు జిల్లాకుమూడవ స్థానం దక్కిన నేపథ్యంలో ప్రభుత్వం నుండి వచ్చిన ప్రశంసాపత్రం,ల్యాప్ టాప్ ని గురువారం కలెక్టర్‌తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ రెవిన్యూ, సి. హెచ్. మహేందర్ జి తో కలిసి పీడీ హోసింగ్, యస్. సూర్య నారాయణకి అందచేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి మన జిల్లా ను రాష్ట్ర స్థాయిలో మంచి స్థానం లో నిలబెట్టెందుకు ప్రజా ప్రతినిధులు, మండల స్పెషల్ అధికారులు, హోసింగ్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ లు, ఎం.పీ.వో.లు, పంచాయతీ అధికారులు కృషి చేయాలని నిర్దేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్మాణాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ను ఎప్పటికప్పుడు సందర్శించి లబ్ధిదారులతో నిరంతరం మాటాడారు.