29-08-2025 01:04:06 AM
* వనపర్తి, గద్వాల జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై యువ నేతలు నజర్ పె ట్టారు. గ్రామాల్లో కీలకమైన సర్పంచ్, ఎంపీ టీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవు తున్నారు. గ్రామాల్లో ఉంటూ పలు కార్యక్రమాలను నిర్వ హిస్తూనే రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీ చేసేందుకు ప్ర యత్నాలు చేస్తు న్నారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎ స్, బీజేపీల నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతు న్నారు. పార్టీల నుం చి అవకాశం రాకుంటే స్వతంత్రంగానైనా బరిలో నిలిచేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మంత్రులను కలు స్తూ పోటీకి సిద్ధం అవుతున్నారు.
వనపర్తి, ఆగస్టు 28 ( విజయక్రాంతి ) : స్థానిక సంస్థల ఎన్నికలపై యువ నేతలు నజర్ పెట్టారు. గ్రామాల్లో కీలకమైన సర్పం చ్, ఎంపిటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రామా ల్లో ఉంటూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూనే రిజర్వేషన్లకు అను గుణంగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతు న్నారు. పార్టీల నుంచి అవకాశం రాకుంటేస్వతంత్రంగానైనా బరిలో నిలిచేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేసుకుంటున్నారు.
గ్రా మాల వారిగా ఉన్న ఓట్లను పరిశీలిస్తూనే ఆ యా వర్గాల వారితో మంతనాలు జరుపుతూ పోటీకి సన్నద్ధ మపుతున్నారు. గతం లో పని చేసిన మాజీ ప్రజా ప్రతినిధులకు ధీ టుగానే పోటీ చేసేందుకు తగిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఉన్నత విద్యావంతులతో పాటు వ్యాపారాల్లో ఉన్నవారు ఈ పదవు లపై దృష్టిపెట్టి గట్టి ప్రయత్నాలు చేస్తున్నా రు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కలుస్తూ పోటీకి సిద్ధం అవుతున్నారు.
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసే దిశగా అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వ హించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే వనపర్తి, గద్వాల జిల్లా పరిధిలో ఈ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టెందుకు అధికారులు ఆ దిశగా తమ పనులను చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల పరిధి లో గ్రామాలకు అనుగుణంగా ఓటరు జాబి తా లను ప్రకటించారు. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్ల పనులకు సంబందించిన ఆ ర్డర్ పనిని పూర్తి చేసే దిశలో ఉన్నారు.
ప్రభు త్వం బీసీ రిజర్వేషన్ ను ప్రకటించి ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే వి ధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు . గ్రా మాల్లో సర్పంచ్ ఎన్నికలతో పాటు మండల స్థాయి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే విధంగా అన్ని సిద్ధం చేశారు. ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది యువ నేతలు సిద్ధమవుతున్నారు.
గతంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీ టీసీలుగా పనిచేసిన వారితో పాటు కొత్తతరం నేతలు ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీ క్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో కీలకం గా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులపై దృష్టి పెట్టి పనులను చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీ లైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఆయా పార్టీలో విద్యార్థి, యువజన విభాగాల్లో పనిచేసిన నేతలతో పాటు పార్టీ గ్రామ, మండల శాఖ, జిల్లా శాఖలో పనిచేసిన కీలక యువ నేతలు ఈ పోటీ కోసం ఏ ర్పట్లను చేసుకుంటు న్నారు. ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్లకు అనుగుణంగా గ్రామాల్లో పోటీకి సిద్ధమవుతు న్నారు.
సర్పంచ్, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ఎన్ని కయితే ఐదేళ్ల పా టు పదవుల్లో ఉండే అవకాశం ఉండటంతో యువకులు ఎక్కువగా దృష్టి పెట్టా రు. ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ఎంపికయితే భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉండటంతో విద్యావంతులు, చేసుకునే యువత మొగ్గు చూపుతున్నారు.
పోటీకి ఎక్కువ మంది ప్రయత్నాలు
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ముందస్తుగానే పోటీ కోసం యువ నాయకులు త మ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ పదవులకు ఎంపీక అయితే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉండటంతో ఎంతయినా ఖర్చు చే సేందుకు సిద్ధమవుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా గ్రామాల్లో ఉండి కార్యక్రమాల నునిర్వ హిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రజలకు అందు బాటులో ఉంటూ సామాజిక స మీకరణాలకు అనుగుణంగా వారి మద్దతు ను కూడగట్టే ప్రయ త్నాలు చేస్తున్నారు.
గ్రా మాల్లో కొంతమేర ఖర్చుపెడుతూ పోటీకి స న్నద్ధమవుతున్నారు. గ్రామాల్లో జరిగే పెళ్లిళ నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నా రు. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించకుంటే సతీమణులతో పాటు కుటుంబంలోని ఎవరినైనా పోటీలో ఉండే విధంగా ఏర్పాట్లను చేసుకుంటున్నారు. మండల పరిషత్ అధ్యక్షుడు, జడ్పిటిసీ పదవులపై దృష్టి ప్రయత్నా లు చేస్తున్నారు. పోటికోసం ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికార పార్టీ నుంచే కాకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి కూడా పోటీ కోసం ఎక్కువ మంది సి ద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ ఎన్నిక లపై తీసుకునే నిర్ణయం ఆధారంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొంత మంది యువ నేతలు ఈ పార్టీల నుంచి అవకాశం రాకుంటే స్వతంత్రంగానైనా పోటీకి సన్నద్ధమవు తున్నారు.
గ్రామ స్థాయిలో సర్పంచ్ కీలకం కావడం వల్ల పనులు చేసే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. పదవిలో ఉంటే అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఈ పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొ త్తంగా జిల్లా పరిధిలో స్థానిక సంస్థలు ఎప్పు డు నిర్వహించిన సీనియర్ నేతలకు మాత్రం యువత నుంచి ఈ దఫా పోటీ తప్పే పరిస్థితి లేదు.