29-08-2025 01:34:26 AM
రామాయంపేటలో వర్ష బీభత్సాన్ని పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ
మెదక్, ఆగస్టు 28(విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా రామాయంపేట పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ గురువారం రామాయంపేటలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల లో చిక్కుకున్న 60 మందిని జిల్లా డిజాస్టర్ యంత్రాంగం, రెవిన్యూ , పోలీసులు , వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కాపాడారన్నారు.
జిల్లా పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రభు త్వం పూర్తి అప్రమత్తతో ఉందన్నారు. జిల్లా కు చెందిన ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. వరద ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో మంత్రి టెలిఫోన్లో సమీక్షించారు. గత 50 ఏళ్లలో ఇంతటి భారీ వర్షాలను చూడలేదని స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు.
పట్టణంలోని బీసీ కాలనీ మునిగిపోవడంతో మంత్రి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి నిత్యవసర వస్తువులను భో జనాలను బట్టలను బెడ్ షీట్లను అందజేయాలని ఆదేశించారు. నిజాంపేట మల్క చె రువు, కోనాపుర్, నందిగామ రోడ్డులో దెబ్బతిన్న బ్రిడ్జి, సాయి చెరువు అలుగులను పరి శీలించారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.
ఖేడ్‌లో వరద సహయక బృందాల ఏర్పాటు
నారాయణఖేడ్, ఆగస్టు 28: మూడు రో జులుగా ఏడతెరపి లేకుండా కురుస్తున్న వ ర్షాలు కారణంగా నియోజకవర్గంలోని పలు చెరువులు కుంటలు వాగులు వంకలు ఉ ప్పంగి ప్రవహించాయి. పలు గ్రామాలకు సై తం రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణఖేడ్ పట్టణంలోని పిట్లంకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వాగు బ్రిడ్జిపై నుండి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలోని మధ్యతరహ ప్రాజెక్టు అయిన న ల్లవాగు సైతం అలుగుపై నుండి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. గత మూడు రో జులుగా స్థానిక అధికారులు, పోలీసు సి బ్బంది ప్రజలను వెనువెంటనే అప్రమత్తం చేశారు. నారాయణఖేడ్ లో స్థానిక ఫైర్ స్టే షన్ లో ప్రత్యేక సహాయ బృందాలను ఏ ర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు.
ఎక్కడైనా సహాయం అవసరం ఉంటే 101 లేక ఫైర్ సిబ్బం దికి ఫోన్ చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి తగు వెనువెంటనే మరమత్తులు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మంజీరా ఉగ్రరూపం..
పాపన్నపేట, ఆగస్టు 28: ఎడతెరిపి లే కుండా కురిసినటువంటి వర్షం కారణంగా మంజీరా నది ఉగ్ర మంజీరా గా మారి ఉరకలెత్తింది. అకాల వర్షాల కారణంగా మండలంలోని చాలా గ్రామాల్లో రోడ్లపైకి నీరు రావడంతో రాకపోకలను నిలిపివేశా రు. ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వ ర్షాల కారణంగా చాలా మట్టుకు ఇండ్లు పూ ర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుం డా పోచారం ప్రాజెక్టు వరద బీభత్సం సైతం మంజీరాకు తోడు అవడంతో పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి, ఆరేపల్లి, కుర్తివాడ,ముద్దాపూర్ తదితర గ్రామాల్లో ముం పు ఉన్నటువంటి ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకుగా ను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా గాంధారిపల్లి ఆరేపల్లి కుర్తివాడ గ్రా మాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త రలించారు. మెదక్‌బోడమట్పల్లి రోడ్డుపై రా కపోకలు నిషేధించారు. మిన్పూర్‌పాపన్నపేట మధ్య నిజాంసాగర్ బ్యాక్వాటర్ రోడ్డు పై నీరు పారడంతో రవాణా నిలిచిపోయిం ది. చీకోడెకొంపల్లి మధ్య చెరువు అలుగు రహదారిపైకి రావడంతో రాకపోకలు ఆగిపోయాయి. నార్సింగిఅర్కెల మధ్య వాగు ఉ ద్ధృతంగా ప్రవహించడంతో రహదారి మూ సివేశారు. లింగాయిపల్లియెల్లుపేట రహదారిపై నీరు చేరడంతో ప్రజలు ప్రయాణం కష్టమైంది. అన్నారంఅన్నారం తాండా మ ధ్య వాగు పొంగడంతో తాండా ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా మారాయి.
పునరావాస కేంద్రాలకు ప్రజలు..
సింగూర్ వరదతో పాటు హల్దీ వాగు నుంచి వస్తున్న వరద మంజీర నదిలో కలవడం వల్ల నది చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీనికి తోడు పోచారం ప్రాజె క్టు నుంచి సైతం లక్షన్నర క్యూసెక్కుల నీరు మంజీరా నదిలో కలవడం వల్ల మంజీరా ప్రవాహం ఉధృతంగా సాగింది. దీంతో గాం ధర్ పల్లి, ఆరేపల్లి, కుర్తివాడ తదితర గ్రామాలను అలర్ట్ చేశారు. ఆయా గ్రామాలకు సం బంధించిన పంచాయతీ కార్యదర్శులు రాత్రివేళలో సైతం గ్రామాల్లోని ప్రజలను పున రావాస క్రేంద్రలకు తరలించేందుకు ఏర్పా టు చేశారు.
గాంధారిపల్లిలోని ముంపు ప్రాంత ప్రభావిత ప్రజలను లక్ష్మీనగర్ ఎస్‌ఆర్ గార్డెన్ లోకి, ఆరేపల్లి, కుర్తివాడ గ్రామా ల్లో ఉన్నటువంటి ప్రజలను స్థానిక పాఠశాలల్లోనికి తరలించి తగిన ఏర్పాటు చేశారు. ఇలావుండగా అకాల వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. కొడపాక, పొడ్చన్పల్లి, గాంధారిపల్లి, ఆరేపల్లి, కుర్తివాడ, మి న్పూర్, ముద్దాపూర్, చికోడ్, కొంపల్లి గ్రామాలలో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు సేఫ్
సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 28 : సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట చెరువు కట్ట పైనుండి పొ లాల్లోకి వెళ్లి వరద ఉధృతిలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను ఎస్డిఆర్‌ఎఫ్ సభ్యులు బోటులో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, దుబ్బాక సీఐ శ్రీనివాస్, భూంపల్లి ఎమ్మా ర్వో, భూంపల్లి ఎస్‌ఐ హరీష్, రెవెన్యూ శాఖ సమన్వయంతో ఆ ముగ్గురిని కాపాడారు. వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చే స్తూ, రెవెన్యూ, పోలీస్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సంగారెడ్డి, ఆగస్టు 28(విజయక్రాంతి): జిల్లాలో కురిసిన వర్షాలపట్ల అన్ని శాఖలు అ ధికారులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. గురువారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట ఎర్రగుంట, మాసాను కుంట చెరువులు వరదనీటితో పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా పర్య టించారు. రేణిగుంట చెరువులో ఏర్పడిన గండిని పరిశీలించిన కలెక్టర్ తక్షణ మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
చెరువు కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని, నీరు సవ్యంగా కిందికి పారేలా మార్గాలు కల్పించాలని సూ చించారు. వాగులు, చెరువులు, కుంటల వద్ద కు ప్రజలు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, రెవెన్యూ, పోలీస్, నీటి పారుదలశాఖ , మున్సిపల్ శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టంచేశారు.
జిల్లాలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 08455 - 276155 ఏర్పాటు చేయబడిందని కలెక్టర్ తెలిపారు. చెరువుల కట్టలు,వాగులవద్ద ఇం జనీర్లు తనిఖీలు నిర్వహించి భద్రత చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
ఇంటింటికీ తిరిగి ఇంటె న్సివ్ జ్వర సర్వేలు నిర్వహించి, సత్వర చికిత్స అందించాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతా లలో ముఖ్యమైన రహదారులు, జంక్షన్లలో గుంతలను వెంటనే పూడ్చే చర్యలు చేపట్టాలన్నారు. వాహన రాకపోకలకు ఆటంకం కలుగకుండా, రహదారుల భద్రత, మరమ్మత్తుల తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జలమయమైన సిద్దిపేట జిల్లా
సిద్దిపేట, ఆగస్టు 28 (విజయక్రాంతి): రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా జలమయమైంది. జిల్లా లోని అన్ని గ్రామాలలో రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. సిద్దిపేట పట్టణం లోని శ్రీనగర్, శ్రీనివాస్ నగర్, భారత్ నగర్ హరిప్రియ నగర్, అర్బన్ తహసిల్దార్ కార్యాల యంతో పాటు పలు కాలనీలు జలదిగ్బంధానికి గురయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొన్న ది. జిల్లాలో అత్యధికంగా కొమరవెల్లి మండలంలో 134.8 మీ.మీ, అత్యల్పంగా అక్కన్న పేట మండలంలో 9.3మీ.మీ వర్షపాతం న మోదయింది.
సిద్దిపేట మెదక్ సరిహద్దు గ్రా మమైన చిన్న నిజాంపేట లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరిని సిద్దిపేట జిల్లా భూంపల్లి పోలీసులు రక్షించారు. కొండపాక మండలం దు ద్దెడ, అంకిరెడ్డిపల్లి, బందారం, గ్రామాల మధ్యగల లింకు రోడ్డు భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దాంతో ఆ గ్రామాలకు రాకపో కలు నిలిచిపోయాయి. తొగుట మండలం వెంకట్రావుపేట, చందాపూర్, కోలుగూరు గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయి ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.
అప్రమత్తంగా ఉండాలి...
జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ అనురాధలు అధికారులను ఎప్పటిక ప్పుడు అప్రమత్తం చేస్తూ జిల్లాలో పర్యటించారు. రోడ్లపై నీరు పారేచోట, వాగులు, మత్తడులు పారుతున్నచోట ప్రమాదపు హె చ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాల ప్రయాణాలకు అవకాశం లేకుండా చే శారు. అధికారులను వారి పరిధిలో చేయాల్సిన విధులను గుర్తు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట పట్టణంలో జలదిగ్బంధానికి గురైన కాలనీలలో పోలీసులు, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం సహాయంతో ప్రజలకు నిత్యవసరాలను అందజేశారు.
గజ్వేల్ లో
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఎర్రగుంట అలుగు పారడంతో తూప్రాన్ మార్గంలో సబ్స్టేషన్, పెట్రోల్ బంక్ లో కి నీ రు అధికంగా చేరింది. విద్యుత్ శాఖ అధికారులు మోటార్లు పెట్టి సబ్ స్టేషన్ నుండి నీటి ని బయటకు పంపించారు. దాదాపుర కిలోమీటర్ వరకు ప్రధాన రహదారిలో నీరు నిలిచిపోయింది. అలాగే ప్రజ్ఞాపూర్ ఊర చె రువు అలుగు పారడంతో గజ్వేల్ వైపు వచ్చే రహదారి తో పాటు పెట్రోల్ బంక్, దుకాణాలలోకి నీరు చేరాయి. పట్టణంలో చాలా ప్రాంతాలు వర్షం నీరుతో నిండిపోయాయి.
90 శాతానికి పైగా చెరువులు గజ్వేల్ నియోజకవర్గం లో అలుగులు పారుతుండగా, చా లావరకు పంట పొలాల్లోకి నీరు చేరాయి. అ హ్మదీపూర్ చెరువు అలుగు పారి సింగాటం డబుల్ బెడ్రూంలోకి నీరు అధికంగా రావడంతో వారందరిని సింగాటం ప్రభుత్వ పాఠ శాలకు తరలించి నివాస ఏర్పాట్లు చేశారు. అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ పునరావాసాన్ని పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. జగదేవపూర్ మండలం ఇటిక్యాల ప్రాథమిక పాఠశాల పూర్తిగా జలమయం అయ్యింది.
వర్షాలకు నీటిపాలైన పంటలు
జహీరాబాద్, ఆగస్టు 28 : జహీరాబాద్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్ప డింది. జహీరాబాద్ నుండి కర్ణాటక వెళ్లే నా రింజ ప్రాజెక్టు నిండుకుండలా మారి నీ రంతా కర్ణాటకకు వెళ్ళిపోతుంది. దీంతోపాటు రైతులు వేసిన పంట పొలాల్లో నీరు చేరి అపార నష్టం సంభవించింది. చేతికొచ్చి న పెసర పంట కురుస్తున్న వర్షానికి మొలకలెత్తి రైతులకు చేతికందకుండా పోయింది దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ వర్షానికి పత్తి పంట కూడా దెబ్బతిన్నది. చెరుకు పంట వర్షాలకు నేలకొరిగింది. ఎల్గో యి రీజినల్ మధ్య గల కల్వర్టు నుండి నీరు ప్రవహించడం వల్ల రెండు గ్రామాలకు రాకపోకలు మూడు రోజులుగా నిలిచిపోయా యి. పాలవరం గ్రామానికి వెళ్లే వాగు పొం గుతుంది. జరాసంగం మండలం జిలకపల్లి పెద్దవాగు నిండుకుండల మాడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నారింజ ప్రాజెక్టును గురువారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పరిశీ లించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
భారీ వర్షానికి కూలిన ఇండ్లు
తూప్రాన్, ఆగస్టు 28 : నాలుగు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు తూప్రాన్ ము న్సిపల్ పరిధి తాతపాపన్ పల్లిలో రెండు పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తా తపాపన్ పల్లిలోని మాజీ ఎంపీటీసీ ఎక్కల్ దేవ్ వెంకటేష్ యాదవ్ తన నివాసమైన పెంకుటిల్లు భారీ వర్షాలకు కూలిపోయింది. మున్సిపల్ అధికారులు వచ్చి శిథిలావస్థలో కూలిన ఇండ్ల వివరాలు తీసుకోవడం జరిగింది.
అలాగే మనోహరాబాద్ మండలం కాళ్లకల్ పట్టణంలో రెండు పెంకుటిళ్లు కూలిపోయాయి.తక్షణమే గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రియాంకతో పాటు మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ వెళ్లి పరిశీలించడం ఇంటి వివరాలు సేకరించారు. వీరివెంట మై నారిటీ నాయకులు ఇర్ఫాన్, చుక్క నర్సింహ, బిల్ కలెక్టర్ తదితరులు ఉన్నారు.