calender_icon.png 29 August, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శ్లోక’పై కనికరమేలా..?

29-08-2025 12:49:45 AM

  1. కలెక్టర్ సార్ మీరే కాపాడాలి 
  2. మొద్దునిద్ర వీడని.. మున్సిపల్ అధికారులు
  3. 5 యేండ్లకు పైగా పాతుకుపోయిన టీపిఓ
  4. సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేశారా..?
  5. ఉన్నతాధికారులు స్పందించి గిఫ్ట్ డీడ్ చేసిన స్థలాన్ని కాపాడాలంటున్న స్థానికులు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 28: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది ఆదిభట్ల మున్సిపల్ అధికారుల తీరు. కంచె చేను మేసే చందంగా  అక్రమార్కులకు మున్సిపల్ అధికారులు వంత పాడటం గమనార్హం. అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్న ఆదిభట్ల మున్సిపాలిటీలో మరో వైపు అక్రమాల పర్వం బహిర్గతం అవుతున్న అధికారుల్లో ఉలుకు, పలుకు లేదు. ఆదిభట్ల మున్సిపాలిటీకి సంబంధించిన గిఫ్ట్ డీడ్ స్థలం అన్యాక్రాంతం అయ్యిందని, అధికారులకు తెలిసినా చర్యలు తీసుకునేందుకు మీన వేషాలు లెక్కిస్తున్నారు.

ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ముడుపులు అందడంతోనే చర్యలకు జంకుతున్నారన్న మున్సిపాలిటీ ప్రజలు బహిరంగంగానే  చర్చించుకుంటున్నారు. ఒకవేళ శ్లోక కన్వెన్షన్ ఆక్రమించుకున్న  స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే  రాజకీయ ఒత్తిళ్లు తప్పవనే భ్రమలో ఉన్నట్లు తెలుస్తోంది.? కానీ ప్రభుత్వ స్థలాన్ని  కాపాడకపోతే  శాఖపరమైన చర్యలు తమ పై  ఉన్నతాధికారులు  తీసుకుంటారనే  భయం అధికారుల్లో లేకపోవడం విడ్డూరం.

దీంతో ఉన్నతాధికారుల కనుసైగాలతోనే  అక్రమార్కులకు వంత పాడుతున్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.  మున్సిపల్ లో నిబంధనకు విరుద్ధంగా  గజం స్థలం జరిగిన, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన  తప్పుల ను పసిగట్టి ఆగమేఘాలమీద అక్కడి కి వెళ్ళి, విరుచుకుపడే సోయి, బడా వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే ఎక్కడపోయిందని మున్సిపల్ ప్రజలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

మున్సిపాలిటీ పరిధిలో   అన్యాక్రాంతమైన సుమారు రూ.15 కోట్లకు పైగా విలువ చేసే మున్సిపాలిటీ గిఫ్ట్ డీడ్ స్థలాన్ని కాపాడేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, అక్రమార్కులకు వంత పాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 ఏళ్ల సంధి పాతుకుపోయిన టీపిఓ.....

 మున్సిపాలిటీలో  టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి  ఏళ్ల సంధి ఇక్కడే పాతుకు పోయారు.సుమారు 5 ఏళ్ల కు  మున్సిపాలిటీలో ఇంచార్జి టీపిఓగా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క,హుస్నాబాద్, జల్ పల్లి మున్సిపాలిటీలలో కూడా టీపిఓగా కొనసాగుతున్నారు. వారంలో  బుధ,గురు వారాల్లో 2 రోజులు మాత్రమే ఆదిభట్ల కార్యాలయంలో విధులకు హాజరవుతారు. ఫీల్ లో టీపీవో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే మున్సిపాలిటీలో అక్రమ స్థలాలు కబ్జా, అక్రమ నిర్మాణాలు అడ్డు అదుపు లేక  కొనసాగుతున్నాయి.

శ్లోక కన్వెన్షన్  గిఫ్ట్ డీడ్ స్థలం వ్యవహారంలో సైతం టీపిఓ కు కూడా ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టిపిఓ ఆడిందే ఆట.. పాడింది పాటగా కొనసాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై  వివరణ కోసం ఫోన్ లో  టీపీఓ ను సంప్రదిస్తే అటునుంచి ఎలాంటి స్పందన ఉండదు. మున్సిపల్ కార్యాలయంలో   ప్రత్యక్షంగా కలిసి వివరణ అడగగా  కమిషనర్ సార్ నే ను అడగండి అంటూ ఆమె దాటవేయడం మేడంకు షరమాములే.

సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మకై.. ?

శ్లోక కన్వెన్షన్ యాజమాన్యం హెచ్‌ఎండీఏ ప్లాన్ లో భాగంగా స్థానిక మున్సిపాలిటీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ స్థలాన్ని కూడా కలిపి, ఎవ్వరికి అనుమానం రాకుండా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ తో కుమ్మకై లీజ్ డీడ్ సైతం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అన్యాక్రాంతమైన మున్సిపల్ స్థలానికి సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే హైడ్రాను ఆశ్రయిస్తాం.

నియోజకవర్గంలో మిగతా మున్సిపాలిటీలతో పోల్చుకుంటే ఆదిభట్ల మున్సిపల్ అధికారుల తీరు బిన్నంగా ఉంది. అక్రమాలపై ఇటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు, అటు హెచ్‌ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం నిర్లక్ష్యం చేయడం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడేందుకు త్వరలోనే దీనిపై హైడ్రాను ఆశ్రయిస్తాం.

 - మచ్చ మహేందర్, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ