29-08-2025 01:20:38 AM
గుమ్మడిదల, ఆగస్టు 28 : పరిశ్రమ నుండి వెలువడే ధూళి, బూడిద గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది. నిబంధనల మేరకు ప రిశ్రమలు ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లకుం డా చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీం తో పరిశ్రమ యాజమాన్యం ఇష్టారీతిగా కా లుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
గుమ్మడిదల మం డలంలోని మంబాపూర్ గ్రామంలో తిరుమల పేపర్ పరిశ్రమ నుండి వస్తున్న నల్లటి బూడిద ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారింది. వర్షం పడితే చాలు ఈ బూడిద నీటిలో కలిసిపోయి పంట పొలాలు నష్టపోతున్నామని గ్రామస్తులు, రైతులు వాపో తున్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న ధూళి, పొగల వల్ల పక్కనే ఉన్న పంట పొ లాలు నాశనం అవుతుండగా పశువులు కూ డా అనారోగ్యానికి గురవుతున్నాయి.
చిన్నపాటి వర్షం కురిసినా పరిశ్రమ నుంచి వచ్చే రసాయన బూడిద వర్షపు నీటితో కలసి పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. దీంతో పం టలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. పటేల్ చెరువులోకి కూడా బూడిద కలిసిపోవడం వల్ల చెరువు నీటిని తాగే పశువులు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నాయి.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ రాత్రింబవళ్లు పరిశ్రమ నుంచి వచ్చే బూడిద కారణంగా ఇంటి బయట ఉన్న నీళ్ల డ్రమ్ములు, బట్టలు నల్లగా మారుతున్నాయని తెలిపారు. పిల్లలు, వృద్ధులు దగ్గు, దమ్ము, ఊపిరితిత్తుల సమస్యలతో బా ధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కాలుష్య నియంత్రణ అధికారు లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిద్రమత్తులో పీసీబీ...
మంబాపూర్లో ఉన్న తిరుమల పేపర్ పరిశ్రమ నుండి కాలుష్యభరితమైన బూడిద విపరీతంగా రావడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. పరిశ్రమ యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కనీసం తనఖీలు కూడా చేయడం లేదని వాపోయారు. పరిశ్రమ నుండి వెదజల్లే బూడిద వల్ల నీరు, పంటలు, పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇప్పటికైనా పరిశ్రమపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.