calender_icon.png 20 September, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యం, స్వచ్ఛత మనందరి బాధ్యత

20-09-2025 12:48:00 AM

 జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 19: ఆరోగ్యం, స్వచ్ఛత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్లో స్వచ్ఛత  హి సేవా పత్సవాల సందర్భంగా రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో ఆరోగ్యం, స్వచ్ఛతను పాటిచడం మనందరి బాధ్యత అందుకే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆరోగ్య సూత్రాలు పాటించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సూచించారు.

ఎవరి కుటుంబం పరిధిలో వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దాదాపు దరిచేరవని తెలిపారు. ప్రతి గ్రామంలో వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు  పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు.  స్వచ్ఛతహీ సేవా కార్యక్రమాలను సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 02 వరకు జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా చెత్త నిల్వ ప్రదేశాలను గుర్తించి పరిశుభ్రంగా ఉండేలా చూడడం, పాఠశాలలు, ఏడబ్యూసి, పీహెచ్సి, మార్కెట్, పబ్లిక్ ప్లేసేస్, దేవాలయాలు, శుభ్ర పరచడం, ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పరిశుభ్రతా అవగాహన కార్యక్రమాలు, ఎం పి హె డబ్ల్యూ లకు హెల్త్ క్యాంపస్ లు నిర్వహించడం, సింగల్ యుజ్ ప్లాస్టిక్ నష్టాల గురించి వివరించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి ని ఉత్సవంలా జరపాలని తెలిపారు. సెప్టెంబర్ 25న ఏక్ దిన్, ఏక్ సాత్, ఏక్ గంట  కార్యక్రమాన్ని అందరు కలిసి ఒక గంట శ్రమదానంతో గ్రామంలోని ప్రజా స్థలల్లో చెత్తను తోలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ , డిఆర్డివో రఘువరన్, ఎస్బిఎం కన్సల్టెంట్‌లు ఎం.హరిణి, జి. చిరంజీవి పాల్గొన్నారు.