calender_icon.png 20 September, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సంరక్షణ రంగంలో వేగవంత మార్పులు

20-09-2025 12:49:19 AM

  1. అందుకు అనుగుణంగా నాయకులు చురుకుగా స్పందించాలి

ఏహెచ్‌పీఐ లీడర్‌షిప్ సమ్మిట్‌లో వక్తల సూచనలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ‘హైటెక్ హెల్త్‌కేర్ యుగం లో నాయకత్వ’ అనే అంశంపై జాతీయ స్థాయిలో రెండు రోజులపాటు జరిగే అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండి యా (ఏహెచ్‌పీఐ)  లీడర్ షిప్ సమ్మిట్ శుక్రవారం బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ డెక్కన్‌లో ప్రారంభమైంది. ఆరోగ్యరంగం, పరిశ్రమలు.. తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రజలకు ప్రాధాన్యమిచ్చే నాయక త్వం, ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ ఆరోగ్య సంరక్షణకు కావాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా పాట్రన్ డాక్టర్ అలెగ్జాండర్ థామస్, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రొఫెసర్ రంగారెడ్డి తమ విలువైన అనుభవాలను పంచుకున్నారు.

సమావేశంలో కిమ్స్ హెల్త్ హాస్పిటల్స్ చైర్మన్, క్లినికల్ అడ్వైజర్ ఆఫ్ క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్, ఏహెచ్‌పీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎంఐ సహదుల్లా మాట్లాడుతూ.. ఆరోగ్యరంగంలో అనుకూలమైన, కరుణతో కూడిన నాయకత్వాన్ని గుర్తుచేశారు. ‘ఆరోగ్య సంరక్షణ రంగం వేగంగా మారుతోంది. ఈ మార్పులకు అనుగుణంగా నాయకులు చురుకుగా స్పందిం చాలి. సాంకేతికత రోగులను పరీక్షించే, చికిత్స చేసే, సంరక్షించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.

కానీ ఆవిష్కరణలు ఎప్పటికీ సానుభూతిని మించకూడదు’ అని అభిప్రాయపడ్డారు. క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ ఎండీ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. ‘భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ స్థిరత్వం ఒక్క రాత్రికే ఏర్పడదు. ఇది గత అనుభవాల నుం చి నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్తు కోసం ధైర్యవంతమైన సంస్కరణలతోనే సాధ్యపడుతుంది’ అని పేర్కొన్నారు.

డాక్టర్ సంజీవ్ సింగ్ (అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫరీదాబాద్), డాక్టర్ దేవి శెట్టి (నారాయణ హెల్త్ చైర్మన్) సహా పలువురు నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.