calender_icon.png 8 January, 2026 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో వైద్య శిబిరం

07-01-2026 06:08:15 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో బుధవారం వైద్య సిబ్బంది ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సృజన్ కుమార్ మాట్లాడుతూ... మొన్న మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత గురైన సందర్భంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించి 46 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన ఎనిమిది మంది విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.