07-01-2026 06:04:17 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ 6వ డివిజన్ లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఘట్ కేసర్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ బుధవారం మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతిపత్రం అందజేశారు. ఘట్ కేసర్ ఫ్లైఓవర్ సమస్యకు బడ్జెట్ కేటాయించుట, ముఖ్యంగా ఫ్లైఓవర్ అయ్యేవరకు గతంలో మంజూరైన రోడ్డును తొందరగా వేసి కృష్ణ వాటర్ పైప్ లైన్ విద్యుత్ స్తంభాలను తొలగించి రాకపోకలు ఇరువైపుల రోడ్డు సౌకర్యము ప్రజలకు ఆటంకం లేకుండా చేయాలని వినతిపత్రంలో కోరారు.
అలాగే నీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని, గతంలో జిల్లా కలెక్టర్ కి, అడిషనల్ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చి సంవత్సరం అవుతున్న చర్యలు లేవని ముందస్తు జాగ్రత్తగా వేసవిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరమైనా నీటి ఎద్దటి లేకుండా చూడాలని కోరారు. శానిటేషన్ ఆస్తవ్యస్తoగా ఉన్నదని కావున శానిటేషన్ తో పాటు లైటింగ్ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉన్నదని ఇట్టి సమస్యలను నివారించాలని కోరారు. ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయం కు వెళ్లే రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ వేయాలని మనవి చేశారు.
అన్ని మతాల స్మశాన వాటికలను, పార్కు స్థలాలను అభివృద్ధి చేయాలన్నారు. పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో కుక్కల, పాముల వ్యాక్సినేషన్ ఉండే విధంగా చూడాలని కోరారు. పాత మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా మీడికల్ మెటీరియల్ ను మేడ్చల్ జిల్లా మెడికల్ డిపార్ట్ మెంట్ కు పంపించి పంపించి పాత మున్సిపాలిటీ ఆఫీసును మన డివిజన్ ఆఫీస్ పక్కన ఉన్న మహిళా భవనమును పాత మున్సిపాలిటీ భవనంలోనికి తరలించాలన్నారు. ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని ఇంటి పన్నులను యధా విధoగా కొనసాగించాలని, ముఖ్యంగా పెంచకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్కు అందజేసిన వినతిపత్రంలో కోరారు.