సర్కారు దవాఖానాల్లో ఆరోగ్య సుస్థి
- నామమాత్రపు ఆరోగ్య సేవలు
- మందుల కొరత.. నిరాశలో రోగులు
ఖానాపూర్, జులై 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిరుపేదలకు వైద్యం అందాన్ని ద్రాక్షగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదని పలువురు అంటున్నారు .దానికి నిదర్శనంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొర వైద్యం అందడంతో నిరుపేదలు చేసేది లేక ప్రైవేట్ ఆసుపత్రిలను ఆశ్రయించి వైద్యం చేయించుకుంటున్నారని అంటున్నారు.
దీంతో పేదలపై ఆర్థిక భారం పడి మరింత కుదేలవుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వందల సంఖ్యలో నిరుపేదలు, వైద్యం చేయించుకోసం వస్తుంటారు .కాగా వర్షాకాలం మొదలైనప్పటి నుంచి సరైన వర్షాలు లేక ప్రజలు జ్వరాలు, వీరేచనాల తో ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. వీరికి నామ మాత్ర పు వైద్యం అందుతుందని సత్తనపల్లి, ఖానాపూర్ లకు చెందిన కొందరు రోగులు అనడం విశేషం .స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్స చేయించుకున్నామని వివరించారు.
ఈ నేపథ్యంలో కేవలం ఒక్క జూన్ నెలలోనే 1239 మంది ఇన్ పేషెంట్లుగా ఆసుపత్రిలో నమోదైనప్పటికీ దీంట్లో పలువురు ప్రైవేట్ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకున్నట్లు అంటున్నారు.ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రిల యాజమాన్యం చెలరేగిపోయి అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వున్నాయి.అంతేకాక ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో వాంతులు ,విరేచనాలు, జ్వరాలతో బాధితులు ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు.
ఆసుపత్రి రికార్డు లీ ప్రకారం ప్రస్తుతం రోజుకు ఓపీ సుమారు 300 లకు పైమాటే అయినప్పటికీ రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రోగులకు మెట్రోనిడిజల్ వంటి సామాన్య ఔషధాలు కూడా అందుబాటులో ఉండడం లేదని, దానికి బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సూపర్డెంట్ వంశీని వివరణ కోరగా ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతున్నాయి.
కావాల్సిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాగా పలువురు రోగులు ప్రైవేట్ ను ఆశ్రయిస్తున్నామని తెలపడం కొస మెరుపు. అంతేకాకుండా ఆసుపత్రిలో కొందరు ప్రైవేట్ యాజమాన్యాల కు దళారులు గా పనిచేస్తున్నట్లు పలు ఆరోపణలు బయట స్త్వ్రరవిహారం చేస్తున్నాయి.






