వడదెబ్బతో మృతి చెందిన కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం
03-07-2026 01:52 AM
హుజూర్ నగర్, జూలై 2: కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన శివాజీ నాగవల్లి ఇటీవల వడదెబ్బతో మృతి చెందాడు.
దీంతో గురువారం మున్సిపల్ కార్యాలయంలో శివాజీ కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేసి మాట్లాడారు... వడదెబ్బతో మృతి చెందిన శివాజీ నాగవల్లి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అదేవిధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ,మట్టపల్లి శ్రీమన్నారాయణ,కైఫ్,క్రాంతి, తదితరులు,పాల్గొన్నారు.






