13-12-2025 01:42:46 AM
జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి సౌజన్య
సంగారెడ్డి, డిసెంబర్ 12 :ఆరోగ్యం ప్రతి పౌరుడి మౌలిక హక్కు అని, ప్రభుత్వ ఆరో గ్య పథకాలు, బీమా పథకాలు, ఎమర్జెన్సీ సే వల గురించి ప్రజలకు అవగాహన పెంచడం ముఖ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే - 2025ను పురస్క రించుకొని శుక్రవారం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆమె ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వ్య క్తికి ఆర్థిక భారము లేకుండా నాణ్యమైన వై ద్య సేవలు అందేలా యూనివర్సల్హెల్త్ కవరే జ్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామీ ణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు స మానంగా వైద్య సేవలు పొందేలా ప్రభుత్వ చర్యలపై చట్టపరమైన అవగాహన అవసరమని తెలిపారు.
ఆసుపత్రుల్లో ఉన్న లీగల్ ఎ యిడ్ క్లినిక్ల ద్వారా పేద, అర్హులైన రోగులకు చట్టపరమైన మార్గనిర్దేశం అందిస్తామని పే ర్కొన్నారు. ఆరోగ్య రంగంలో సమానత్వం, రోగి గౌరవం, అవగాహన పెంచడం ప్రతి ఒ క్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు, ఆరో గ్య సిబ్బంది పాల్గొన్నారు.