14-12-2025 06:30:19 PM
అండర్-19 ఆసియాకప్(Under 19 Asia Cup 2025)లో భారత్ బోణీ కొట్టింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ను 49 ఓవర్లకు కుదించారు. సీనియర్, మహిళల జట్ల తరహాలోనే ఈ మ్యాచ్ లోనూ బీసీసీఐ నో షేక్ హ్యాండ్ విధానాన్నే కొనసాగించింది. ఫలితంగా టాస్ సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు పాక్ ప్లేయర్స్ తో షేక్ హ్యాండ్ కు నిరాకరించారు. అయితే బ్యాటింగ్ లో భారత్ తడబడి నిలబడింది. ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. కేవలం 5 రన్స్ కే ఔటయ్యాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే, హైదరాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరూ నిలకడగా ఆడుతూ 49 రన్స్ జోడించారు. మాత్రే 38 రన్స్ కు ఔటవగా.. ఆరోన్ జార్జ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆరోన్ జార్జ్ 85, కనిష్క్ చౌహాన్ 46 పరుగులతో రాణించారు. దీంతో భారత్ అండర్ 19 జట్టు 240 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో భారత బౌలర్లు విజృభించారు. దీపేశ్ దేవంద్రన్, కనిష్క్ చౌహాన్ మూడేసి వికెట్లతో పాక్ ను దెబ్బకొట్టారు. పాక్ టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లను త్వరగానే పెవిలియన్ కు పంపారు. హుజైఫా 70 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి పాక్ అండర్ 19 జట్టు 150 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండో విజయం. తర్వాతి మ్యాచ్ లో మంగళవారం మలేషియా అండర్ 19 జట్టుతో భారత్ తలపడుతుంది.