calender_icon.png 15 December, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

14-12-2025 06:50:46 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): రైలు ఢీకొట్టడంతో ఓ గుర్తు తెలియని మహిళ మృతిచెందిన సంఘటన ఘట్ కేసర్ రైల్వే స్టేషన్(Ghatkesar Railway Station) పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 10 గంటలకు యంనంపేట్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ మహిళ మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ చేయడం జరిగిందన్నారు.

ఆ మృతురాలి వయస్సు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. రైల్వే ట్రాక్ పట్టాలు దాటుచుండగా ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందినట్టు పైకి కనిపిస్తున్నట్లు తెలిపారు. మృతురాలిని గుర్తించిన వారు సెల్ నెంబర్లు 9440083160, 8701268585 లకు సమాచారం తెలుపగలరని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.