14-12-2025 07:12:55 PM
గానుగబండ, రంగాపురంలో ఎర్రజెండా ఎగరడం ఖాయం
గరిడేపల్లి (విజయక్రాంతి): నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు వీరం రెడ్డి శంబి రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని గానుగబండ, రంగాపురం గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ ఎర్రజెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఆదివారం మండలంలోని గానుబండ గ్రామంలో బీఆర్ఎస్ సీపీఐ ఐక్యత సమావేశంలో పాల్గొని అనంతరం వారు ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థులు బడుగు, బలహీన వర్గాలకు నిరంతరం అండగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండటంతో అధిక మెజారిటీతో విజయం ఖాయమన్నారు.
బీఆర్ఎస్, సీపీఐ ఐక్యత కొనసాగుతూ పేదల పక్షాన నిజాయితీ పాలన అందిస్తుందని, మండలంలోని అన్ని గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త సతీష్‌రెడ్డి, షేక్ సైదా హుస్సేన్, కొత్త రామకృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, పంగా గోవిందు, పోకల ఆంజనేయులు, ఈద ఆంజనేయులు, షేక్ నాగులమీరా, నబీసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.