calender_icon.png 4 August, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత కీలకం

04-08-2025 12:16:37 AM

-చేనేతతో విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి

-వ్యవసాయం రంగం తర్వాతి వంతు చేనేతదే

-మన చేనేతకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): చేనేత, వస్త్ర పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమని దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు.. వి దేశీ మారక నిల్వలు కూడా గణనీయంగా పెరుగుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పన జరుగుతున్నది చేనేత రంగంలోనే అని తెలిపారు. దాదాపు 5 కోట్ల మందికి ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందన్నారు.

చేనేత రం గాన్ని కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా కా ర్యక్రమం ద్వారా ప్రోత్సహించిందని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పుర స్కరించుకొని శిల్పారామంలో వారం రో జుల పాటు జరిగే ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కేంద్రమంత్రి ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫామ్ టు ఫైబర్ ఫాబ్రిక్ ఫ్యాషన్, ఫారిన్ మార్కెట్స్ విజన్‌తో కేంద్రం ముందుకెళ్తోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

దీని కారణంగా.. 11 ఏళ్లలో చేనేత రంగం ప్రతిఏటా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశ జీడీపీలో చేనేత రంగం వాటా 2.3 శాతం కాగా.. పారిశ్రామిక ఉత్పత్తిలో 13 శాతం ఈ రంగానిదేనని వెల్లడిం చారు. 12 శాతం ఎగుమతులు మన చేనేత రంగానివేనన్నారు. ఈ ప్రోత్సాహం కారణంగా చేనేత, వస్త్ర ప్రపంచంలో దేశం ఆరో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. 2023 చేనేతరంగం నుంచి రూ.3 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయని పేర్కొన్నారు.

దీన్ని 2030 నాటికి రూ.9 లక్షల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందుకే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ద్వారా.. కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. నే షనల్ హ్యాండ్‌లూమ్ డెలవప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎన్‌హెచ్‌డీపీ) ద్వారా.. నేతన్నలకు కేంద్రం అండగా నిలిచిందని కేంద్రమంత్రి తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ మార్కెట్ కోసం మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తోందన్నారు. రాయితీలతో కూడిన రుణాలు కూడా ఇస్తున్నట్టు.. నేషనల్, స్టేట్ అవార్డు పొందిన నేతన్నలకు రూ.8వేల నెలవారీ పెన్షన్ కూడా ఇస్తోందన్నారు. నేతన్నల పిల్ల లు.. టెక్స్‌టైల్‌లో ఉన్నత చదువులపై ఆసక్తి చూపిస్తే ఏడాదికి రూ.2 లక్షల స్కాలర్‌షిప్ కూడా అందచేస్తున్నట్టు వివరించారు. 

మన చేనేతకు ప్రపంచవ్యాప్త గుర్తింపు..

నేతన్నల శ్రమకు సరైన గుర్తింపును అందిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలో పాల్గొనేలా సంపూర్ణ సహకా రం అందిస్తున్నట్టు కిషన్‌రెడ్డి వివరించా రు. తెలంగాణకు చెందిన దాదాపు 20 మంది చేనేత కార్మికులు.. మన నేతకళను ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాల్లో జరిగిన ఎక్స్‌పోల్లో వారి ఉత్పత్తులను ప్రదర్శించారని.. ఫలితంగా ప్రపంచ మా ర్కెట్ ఎలా ఉందో మన చేనేత కార్మికులకు తెలుస్తుందన్నారు.

తెలంగాణ రా ష్ర్టం.. అంతర్జాతీయ చేనేత హబ్‌గా రూ పుదిద్దుకుంటోందన్నారు. ఇక్కడి నేత కళలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంద ని.. మన దగ్గర ఉన్న 17 వేలకు పైగా హ్యాండ్లూమ్స్, దాదాపు 48 వేల నేతన్న లు, అనుబంధ కార్మికులు మన చేనేత రంగానికి గొప్ప ఆస్తులుగా కొనియాడారు. వీరి కళ కారణంగానే.. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ జరీ చీరలు, నారాయణపేట కాట న్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ తివాచీకి జీఐ ట్యాగ్ లభించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కిందన్నారు.

మన తెలంగాణ కళను అంతర్జా తీయం చేసిన మన చేనేత కార్మికులు మనందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు. చేనేత రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. మన నేతన్నలను మోదీ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. చేనేత రంగంలో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

సమగ్రమైన ప్రణాళికతో వస్తే కేంద్ర ప్రభు త్వంతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 7 వరల్డ్ క్లాస్ పీఎం- మిత్ర (పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టై ల్స్ రీజియన్ అండ్ అపారెల్)లు ఇస్తే.. అందులో ఒక టి మన రాష్ట్రానికి కేటాయించిందన్నారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్.. దాదాపు రూ.10వేల కోట్లకు పై గా పెట్టుబడులను ఆకర్షించనుందని... దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 ల క్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.