calender_icon.png 9 October, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

09-10-2025 05:32:47 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దహేగాం మండలంలోని దిగిడే, రాంపూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.