calender_icon.png 9 October, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి

09-10-2025 05:41:51 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఆశ్రమ బాలుర పాఠశాలలో చదువుతున్న మడవి యాదవరావు రాష్ట్ర స్థాయి U/19 బాలుర కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. మహబూబాబాద్ జిల్లాలో ఈనెల 10, 11వ తేదీల్లో జరగనున్న క్రీడల్లో పాల్గొననున్నాడు. మడావి యాదవరావును స్కూల్ ప్రధానోపాధ్యాయులు, పీడీ హీరబాయి, పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, డీవైఎస్ఓ హాఫిక్ హైమాద్, డీఐఈఓ బి. రాందాస్, ఇంటర్మీడియట్ క్రీడల అధికారి బాబూరావు, గిరిజన క్రీడల అధికారి మడవి షేకు, కోచ్ కడతల రాకేష్ శుభాకాంక్షలు తెలిపారు.