calender_icon.png 9 October, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉపేందర్ కు సిపిఎం నివాళి

09-10-2025 05:54:57 PM

నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేటలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కూరెళ్ళ ఉపేందర్ చారి మృతికి సిపిఎం రామన్నపేట మండల కమిటి సంతాపం తెలిపింది. పూల మాలవేసి నివాళులర్పించారు. ఉపేందర్ చారి కుటుంబానికి ప్రభుత్వం పోలీస్ శాఖ ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటి సభ్యులు వనం ఉపేందర్, బల్గురి అంజయ్య, మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, మాజీ సర్పంచ్ మిర్యాల భాస్కర్, గుంజె సైదులు తదితరులు పాల్గొన్నారు.