calender_icon.png 9 October, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ

09-10-2025 05:39:16 PM

ప్రజాధనం కార్పొరేట్ శక్తులకు దారా దత్తం..

మాజీ ఎమ్మెల్యే, సిపిఐ జాతీయ నాయకులు వెంకటరెడ్డి..

హుజురాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ వేలకోట్ల రూపాయలను, ప్రభుత్వ ఆస్తులను ధనాన్ని ధారాధాత్తం చేస్తున్నారని, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద బడుగు బలహీన వర్గాలను విస్మరించారని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కార్పోరేట్ శక్తులైన ఆదాని, రిలయన్స్, సంస్థలతో పాటు ఇతర కార్పొరేటు సంస్థలకు వేల కోట్ల రూపాయల రాయితీని ప్రకటిస్తూ ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు ధారధక్తం చేస్తున్నారని ఆరోపించారు.

పేద బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా పతల కుతలం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా పక్షాన ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాలపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తుందని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, సహాయ కార్యదర్శి కనకం సదానందం, జిల్లా నాయకులు, మండల నాయకులు కార్మికులు, కర్షకులు తదితరులు పాల్గొన్నారు.