09-10-2025 05:59:25 PM
అభినందనలు తెలిపిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): కట్టంగూరు గ్రామం వాసి ఫార్మసీ కళాశాల, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి నుండి నల్ల శారద డాక్టరేట్ పొందారు. పిహెచ్ డి పరిశోధనలో భాగంగా "EVALUATION OF SELECTED INDLAN MEDICINAL PLANTS FOR ANTI - DIABETIC ACTIVITY: IN -VITRO AND IN - VIVO MODELS" అనే అంశంపై పరిశోధన చేశారు. ఫార్మా విభాగం ప్రొఫెసర్ డి. సుజాత మార్గదర్శనంలో పని చేసి తన పరిశోధనా పత్రాన్ని పూర్తి చేసి యూనివర్సిటీకి నివేదించారు.
తేది. 26-09-2025 రోజున యూనివర్సిటీ కమిటీ సభ్యుల సమావేశంలో పరిశోధన పత్రాన్ని అంగీకరించి, పిహెచ్ డి ప్రధానం చేయడానికి అంగీకరించారు. 06-10-2025 రోజున పిహెచ్ డి ప్రధానం చేస్తూ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉత్తర్వులను విడుదల చేసింది. నల్ల శారద పిహెచ్డి సాధించడం ఈ ప్రాంతానికి గర్వకారణం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు నల్ల సత్యనారాయణ, విజయ లక్ష్మిలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి విద్యార్థులు శారదను ఆదర్శంగా తీసుకుని చిత్తశుద్ధితో చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు.