11 April, 2026 | 7:55 AM

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

13-05-2024 01:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచనలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ముందు జాగ్రత్తగా 30 డిజిస్టర్ రెస్క్యూ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచామని, వర్షం కారణంగా ప్రజలు ఏదైనా ఇబ్బందులకు గురైతే జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ 040 1111, 90001 13667 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. నగర పరిసర ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి గ్రామీణ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.